Prime Minister Internship Scheme: నిరుద్యోగులు భలే ఛాన్స్‌.. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకానికి అప్లై చేశారా?

తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు అదరిపోయే అవకాశం తలుపుతట్టింది. ఉన్నత చదువులు చదివి చేసేందుకు ఉద్యోగంలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం ద్వారా అదృష్టం మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చింది. మీరు చేయాల్సిందల్లా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడమే. పలు కంపెనీలు మీ బయోడేటా చూసి ఏడాది శిక్షణతోపాటు, ఉద్యోగం కూడా కల్పిస్తారు..

Prime Minister Internship Scheme: నిరుద్యోగులు భలే ఛాన్స్‌.. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకానికి అప్లై చేశారా?
Prime Minister Internship Scheme

Updated on: Jan 19, 2025 | 3:14 PM

నిరుద్యోగ యువతకు ఇదో అద్భుత అవకాశం. రాబోయే అయిదేళ్లలో దేశంలో దాదాపు 500 టాప్‌ కంపెనీల్లో కోటిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. చదువుకుని, సరైన ఉద్యోగంలేక ఎన్నో అవస్థలు పడుతున్న యువతకు ఇదో అద్భుత అవకాశమనే చెప్పాలి. ఈ పథకంలో భాగంగా యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. మొత్తం 20కి పైగా రంగాలను అభ్యర్ధులు ఎంపిక చేసుకోవచ్చు.

ఎవరు అర్హులంటే..

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకానికి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసి ఉండాలి. ఐటీఐ, పాలిటెక్నిక్‌ డిప్లొమాతోపాటు ఏదైనా డిగ్రీ చేసిన వారు కూడా అర్హులే. ఆన్‌లైన్‌ , దూరవిద్య ద్వారా కోర్సులు చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. తగిన అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 21, 2025వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆధార్, బయోడేటాతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైన వారికి ఏడాది ట్రైనింగ్‌ సమయంలో రూ.5 వేల చొప్పున ఉపకార వేతనం కూడా అందిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.