RCFL Recruitment: రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

|

Mar 18, 2022 | 9:14 PM

RCFL Recruitment: రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (RCFL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయిలో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

RCFL Recruitment: రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Rcfl Recruitment
Follow us on

RCFL Recruitment: రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (RCFL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయిలో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 137 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఆపరేటర్‌(కెమికల్‌ ట్రెయినీ) – (133), జూనియర్‌ ఫైర్‌మెన్‌ – (04) ఖాళీలు ఉన్నాయి.

* ఆపరేటర్‌(కెమికల్‌ ట్రెయినీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-03-2022 నాటికి 29 ఏళ్లు మించకూడదు.

* జూనియర్‌ ఫైర్‌మెన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు 6 నెలల ఫుల్‌టైం ఫైర్‌మెన్‌ సర్టిఫికేట్‌ కోర్సు చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01.03.2022 నాటికి 32 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

* ఆపరేటర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు. జూనియర్‌ ఫైర్‌మెన్‌ పోస్టులకు నెలకు రూ. రూ.18,000 నుంచి రూ.42,000 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 28-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video : తిండి జోలికొస్తే తగ్గేదే లే.. చింపాంజీ చేసిన పనికి పడి పడి నవ్వుతారు..

Chinna Jeeyar Swamy Press Meet: సమ్మక్క సారక్కల వివాదంపై చిన జీయర్ స్వామి వివరణ

NBK 107 Movie: బాలయ్య సినిమాతో మరో కన్నడ హీరో తెలుగులో స్థిరపడనున్నాడా..?