Medical Jobs: నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే.. గవర్నమెంట్ డాక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 విడుదల.. అర్హతలు, ఇతర పూర్తి వివరాలివే!
భారత ప్రభుత్వ రంగానికి చెందిన మహారాష్ట్ర (Maharashtra)లోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...
RCFL Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన మహారాష్ట్ర (Maharashtra)లోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 32
1. స్పెషలిస్టు డాక్టర్ పోస్టులు
విభాగాలు: ఫిజీషియన్, డెంటిస్ట్, డెంటల్ సర్జన్, ఈఎన్టీ సర్జన్, ఫిజియోథెరపిస్ట్, జనరల్ సర్జన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/డీఎన్బీ) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
2. సూపర్ స్పెషలిస్టు డాక్టర్ పోస్టులు
విభాగాలు: కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, రుమటాలజిస్ట్
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/డీఎన్బీ) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
3. పానల్ డాక్టర్ పోస్టులు
అర్హతలు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: RCF, Kural Hospital, Alibaug Bus Station Raigad District, Maharshtra.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 9, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: