RCB Recruitment 2022: బీటెక్ నిరుద్యోగులకు అటర్ట్.. రూ.88,000ల జీతంతో రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు

|

Jul 12, 2022 | 9:06 AM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఫరీదాబాద్‌లోని రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ (RCB Faridabad).. ఒప్పంద ప్రాతిపదికన గ్రాంట్స్‌ అడ్వైజర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌ తదితర పోస్టుల (Grands Advisor Posts) భర్తీకి అర్హులైన..

RCB Recruitment 2022: బీటెక్ నిరుద్యోగులకు అటర్ట్.. రూ.88,000ల జీతంతో రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు
Rcb
Follow us on

RCB Faridabad Grants Adviser Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఫరీదాబాద్‌లోని రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ (RCB Faridabad).. ఒప్పంద ప్రాతిపదికన గ్రాంట్స్‌ అడ్వైజర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌ తదితర పోస్టుల (Grands Advisor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: గ్రాంట్స్‌ అడ్వైజర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌, సీనియర్‌ అకౌంట్స్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌/గ్రాంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌, అకౌంట్స్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు (ఐటీ అండ్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌) పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.33,000 నుంచి రూ.88,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీకాం/బీబీఏ/గ్రాడ్యుయేషన్‌/బీటెక్‌/ఎమ్మెస్సీ/ఎంటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.1000

దరఖాస్తులకు చివరి తేది: జులై 21, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.