RBI Grade B Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్! ఆర్బీఐలో 303 గ్రేడ్‌ ‘బి’ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..

|

Mar 22, 2022 | 4:18 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్‌, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India)కు చెందిన సర్వీసెస్‌ బోర్డు విభాగం గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టుల (Grade B Officer Posts) భర్తీకి అర్హులైన..

RBI Grade B Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్! ఆర్బీఐలో 303 గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..
Rbi Grade B
Follow us on

RBI Grade B Officer Recruitment 2022 Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్‌, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India)కు చెందిన సర్వీసెస్‌ బోర్డు విభాగం గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టుల (Grade B Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 303

పోస్టుల వివరాలు:

  • గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టులు (జనరల్): 238
  • గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టులు (ఎకనామిక్‌ అండ్‌ పాలిసీ రీసెర్చ్‌ విభాగంలోని డీఈపీఆర్‌): 31
  • గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టులు (స్టాటిస్టిక్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్ విభాగం): 25
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ (రాజ్‌ భాష) పోస్టులు: 6
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ (ప్రొటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ) పోస్టులు: 3

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.83,254ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే చాలు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: ఫేజ్‌ 1, ఫేజ్‌ 2 విధానంలో రాత పరీక్షలు జరుగుతాయి. ఫేజ్‌ 1లో మొత్తం 200ల మార్కులకుగానూ 2 గంటల్లో ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ఫేజ్‌ 2లో 3 పేపర్లు ఉంటాయి. ఇవి ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ పద్ధతుల్లో ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 18, 2022 (సాయంత్రం 6 గంటలలోపు)
  • ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్ ఆఫీసర్ ఫేజ్‌ I పరీక్ష తేదీ: మే 28, 2022.
  • ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్ ఆఫీసర్ ఫేజ్‌ II పరీక్ష తేదీ: జూన్ 25, 2022.
  • ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ డీఈపీఆర్‌/డీఎస్‌ఐఎమ్‌ ఫేజ్‌ I పరీక్ష తేదీ: జూలై 2, 2022.
  • ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ డీఈపీఆర్‌/డీఎస్‌ఐఎమ్‌ ఫేజ్‌ II పరీక్ష తేదీ: ఆగస్టు 6, 2022.
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ పరీక్ష తేదీ: మే 21, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CISCE ISC Exam 2022: 12వ తరగతి టర్మ్‌ 2 బోర్డు పరీక్షల కొత్త తేదీలివే! ఎప్పటినుంచంటే..