Railway Jobs: నార్త్ సెంట్రల్ రైల్వేలో 1664 అప్రెంటిస్ పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ..

Railway Jobs: రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రయాగ్‌రాజ్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ...

Railway Jobs: నార్త్ సెంట్రల్ రైల్వేలో 1664 అప్రెంటిస్ పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ..
Railway Jobs

Updated on: Nov 30, 2021 | 7:23 AM

Railway Jobs: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రయాగ్‌రాజ్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ నార్త్ సెంట్రల్ రైల్వే (ఎన్‌సీఆర్)కు చెందిన వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1664 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (డిసెంబర్ 1) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్‌ ట్రేడుల్లో ఉన్న 1664 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్యర్థుల వయసు 01.12.2021 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 02-11-2021 రోజున ప్రారంభం కాగా 01-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Crimes City – Warangal: అక్రమార్కులకు అడ్డగా ఓరుగల్లు మహానగరం.. భయంతో వణికిపోతున్న వరంగల్ ప్రజలు..!

Omicron Alert: ఆ దేశాల నుంచి వచ్చేవారు కచ్చితంగా ఈ రూల్స్ పాటించాల్సిందే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Andhra Pradesh: తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద మరో అద్భుత నిర్మాణం.. వైరల్ అవుతున్న ఫోటోలు..