Railway Jobs: ఇంజనీరింగ్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..

|

Mar 06, 2022 | 6:05 AM

Railway Jobs: ఇండియన్‌ రైల్వే పలు ఉద్ఓయగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన జబల్‌పూర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట్ సెంట్రల్‌ రైల్వే పలు పోస్టులను భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్‌ విధానంలో...

Railway Jobs: ఇంజనీరింగ్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
Summer Holiday Special Trains
Image Credit source: TV9 Telugu
Follow us on

Railway Jobs: ఇండియన్‌ రైల్వే పలు ఉద్ఓయగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన జబల్‌పూర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట్ సెంట్రల్‌ రైల్వే పలు పోస్టులను భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జూనియర్‌ టెక్నికల్‌ అసోయేట్‌, జూనియర్‌ టెక్నికల్‌ అసోయేట్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీ/ డిప్లొమా (సివిల్‌ ఇంజీనిరింగ్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట స్క్రీనింగ్, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది కాంట్రాక్ట్‌ కాలవ్యవధిలో పని చేయాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 17-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Heart Attack: షేన్‌వార్న్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇలా చాలామంది.. చిన్నవయసులోనే గుండెపోటుకి కారణాలేంటి..?

అగ్గిపెట్టెలో పట్టే చీర !! నేతన్న అద్భుతం !! వీడియో

అసభ్యంగా మాట్లాడుతున్నాడని రాయితో కొట్టి.. రెండేళ్ల తరువాత ఊహించని ట్విస్ట్