Punjab National Bank Recruitment 2022: బ్యాంక్‌ జాబ్స్.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో పీవో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (Punjab National Bank).. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల (Specialist Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Punjab National Bank Recruitment 2022: బ్యాంక్‌ జాబ్స్.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో పీవో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..
Pnb
Follow us

|

Updated on: Apr 21, 2022 | 8:41 AM

Punjab National Bank Specialist Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (Punjab National Bank).. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల (Specialist Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 145

పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • మేనేజర్‌ (రిస్క్‌) పోస్టులు: 40
  • మేనేజర్‌ (క్రెడిట్‌) పోస్టులు: 100
  • సీనియర్‌ మేనేజర్‌ (ట్రెజరీ) పోస్టులు: 5

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సీఏ/సీఎంఏ లేదా కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణతతోపాటు ఎంబీఏ (ఫైనాన్స్‌)/తత్సమాన పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాతప‌రీక్ష విధానం: 220 మార్కులకు రెండు గంటల్లో ఆన్‌లైన్‌ విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. ఇక పర్సనల్ ఇంటర్వ్యూ 25 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.850
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ.50

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ 22, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 7, 2022.

ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: జూన్‌ 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Bank of India Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 696 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..