Teaching and Non Teaching Jobs: పంజాబ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..

|

Jan 17, 2023 | 12:47 PM

పంజాబ్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ.. ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (టీచింగ్‌), నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

Teaching and Non Teaching Jobs: పంజాబ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..
Punjab Central University
Follow us on

పంజాబ్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ.. ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (టీచింగ్‌), నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్లైయిడ్‌ అగ్రికల్చర్‌, బోటనీ, ఇంగ్లిష్‌, ఫైనాన్షియల్‌ అడ్మిన్‌, జియోగ్రఫీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, హిందీ, హిస్టరీ, సైకాలజీ, సోషియాలజీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంఈడీ/ ఎంపీఈడీ/ పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. యూజీసీ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 56 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 24, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.750లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.