HDFC Recruitment: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ.. వెంటనే అప్లై చేసుకోండి.

|

Mar 13, 2022 | 8:44 AM

HDFC Recruitment: ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగార్థులకు మంచి అవకాశం కలిపించింది. హైదరాబాద్‌లో పలు పోస్టుల భర్తీకి, అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇంతకీ ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

HDFC Recruitment: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ.. వెంటనే అప్లై చేసుకోండి.
Hdfc Bank
Follow us on

HDFC Recruitment: ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగార్థులకు మంచి అవకాశం కలిపించింది. హైదరాబాద్‌లో పలు పోస్టుల భర్తీకి, అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇంతకీ ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ (టెల్లర్‌), కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎగ్జిక్యూటివ్‌, పర్సనల్‌ బ్యాంకర్‌ సేల్స్‌, రిలేషన్‌షిప్‌ మేనేజర్, బ్రాంచ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధి బ్యాంకింగ్‌ రంగంలో కనీసం 2-3 ఏళ్ల అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను Deepanjali.shah@hdfcbank.com మెయిల్‌ ఐడీకి పంపించాలి.

* అభ్యర్థులను ముందుగా పని అనుభవం ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ రేపటితో (14-03-2022) ముగియనుంది.

* స్థానిక (హైదరాబాద్‌) అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

Also Read: Gautham Karthik: ఆ హీరోయిన్‌తో రిలేషన్‌షిప్‌.. మరో హింట్‌ ఇచ్చిన కోలీవుడ్‌ హీరో..

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఊరటనిచ్చిన రిజర్వ్‌ బ్యాంక్‌.. ఆ ఆంక్షలు తొలగింపు

Train Accident: పట్టాలు తప్పిన రైలు.. 61 మంది మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు..