power grid recruitment 2021: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ లిండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ నార్తర్న్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ డిప్లొమా ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 35 ఖాళీలలో ఉద్యోగులను తీసుకోనున్నారు.
* నోటిఫికేషన్ భాగంగా డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్)–30, డిప్లొమా ట్రెయినీ (సివిల్)–05 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 70శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్లు రెగ్యులర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. డిప్లొమా ఉత్తీర్ణత తప్పనిసరి. అభ్యర్థుల వయసు 15.06.2021 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
* డిప్లొమా ట్రెయినీ సివిల్ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. కనీసం 70శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్లు రెగ్యులర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. డిప్లొమా అర్హత ఉన్నవారినే తీసుకుంటారు. డిప్లొమా లేకుండా.. బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ వంటి అర్హతలున్నా పరిగణనలోకి తీసుకోరు. ఇక అభ్యర్థుల వయసు 15.06.2021 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
* అభ్యర్థులను రాతపరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
* మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ఉండే ఈ పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో 120 ప్రశ్నలు, రెండో విభాగంలో 50 ప్రశ్నలు ఉంటాయి. రెండో విభాగంలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4మార్కు కోత విధిస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 15.06.2021ను నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు http://www.powergrid.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
MLC Elections Postponed: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా
విజయవంతంగా సూపర్ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్.. గ్రేటర్ హైదరాబాద్‌లో తొలిరోజు 21,666 మందికి టీకా..