Magic Course: మ్యాజిక్‌లో ట్రిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? డిప్లొమా కోర్సుకు ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Nov 02, 2022 | 5:55 PM

హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరుగాంచిన శకుంతలాదేవి మ్యాజిక్‌ రంగంలో సాధించిన ఘనత ఎంతో మంది యువకు స్ఫూర్తిగా నిలిచింది. ఐతే ప్రస్తుతం యువత ఆలోచనలు కూడా రొటీన్‌కు భిన్నంగా కొత్తగా సాగుతున్నాయి. దీంతో మ్యాజిక్‌ రంగంలో ఉన్నత శిఖరాలను..

Magic Course: మ్యాజిక్‌లో ట్రిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? డిప్లొమా కోర్సుకు ఇలా దరఖాస్తు చేసుకోండి..
Magic course in Telugu University
Follow us on

శకుంతలాదేవి గురించి మీకు తెలిసే ఉంటుంది. మ్యాథమెటిక్స్‌ అంకెలతో అలవోకగా ఆటలాడేసే శకుంతలాదేవి స్కూల్ విద్యాభ్యాసం కూడా పూర్తి చెయ్యలేదు. నిండా ఆరేళ్లు కూడా నిండని వయసు నుంచే స్టేజ్ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరుగాంచిన శకుంతలాదేవి గిన్నిస్ బుక్‌ రికార్డులను సైతం బద్ధలుకొట్టారు. మ్యాజిక్‌ రంగంలో ఆమె సాధించిన ఘనత ఎంతో మంది యువకు స్ఫూర్తిగా నిలిచింది. ఐతే ప్రస్తుతం యువత ఆలోచనలు కూడా రొటీన్‌కు భిన్నంగా కొత్తగా సాగుతున్నాయి. దీంతో మ్యాజిక్‌ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన పలువురు ప్రముఖులను ఆదర్శంగా తీసుకుని కెరీర్‌ పరంగా ఆయా కోర్సులను అభ్యసించేందుకు ఉరకలెత్తుతున్నారు.

ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్ తర్వాత కెరీర్‌ ఆప్షన్లను ఎంచుకునే వారు మ్యాజిక్‌ డిప్లొమా కోర్సును తమ ఎంపికల్లో చేర్చుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ తాజాగా డిప్లొమాలో మ్యాజిక్‌ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వేదికకానుంది. ఈ మేరకు మ్యాజిక్‌ (ఇంద్రజాలం) డిప్లొమా కోర్సును ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ భట్టు రమేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఏడాదిపాటు నిర్వహించే ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెన్త్‌ అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఎవరైనా నవంబర్‌ 10, 2022వ తేదీలోపు తమ దరఖాస్తులను నేరుగా యూనివర్సిటీలో సమర్పించాలి. ఇతర వివరాలకు 9059794553 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.