AP Model School: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

|

Jan 04, 2022 | 8:27 PM

AP Model School Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్‌ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 282 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి..

AP Model School: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
Follow us on

AP Model School Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్‌ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 282 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర పాఠశాళ విద్యాశాఖ పంపించిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 282 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (211), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ (71) టీచర్ పోస్టులు ఉన్నాయి.

* ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, అనుభవం లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మెరిట్‌ అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* మోడల్‌ స్కూళ్లలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ టీచర్లకు ఈ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తారు.

* ఎంపికైన అభ్యర్థులతో కూడిన జోన్ల వారీగా మెరిట్‌ జాబితాను జనవరి 18, 19న విడుదల చేయనున్నారు.

* అనంతరం జనవరి 20, 21న అభ్యంతరాలను తీసుకోని, ఆ తర్వాత ఆప్షన్లను తీసుకోని జనవరి 28న పోస్టింగ్‌ ఇస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 07-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌తో పాటు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Shahrukh Khan: షారుఖ్‌ అంటే విదేశీయులకు కూడా ఇంత అభిమానమా.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..

Rowdy Boys : సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్న చిన్న సినిమా.. ‘రౌడీ బాయ్స్’ వచ్చేది అప్పుడేనా..?

Medical College Raging: మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటనలో మరో ట్విస్ట్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలనాలు!