Physical Tests for Constable Posts: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి

|

Jan 01, 2025 | 6:26 AM

ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ అభ్యర్ధులకు ఎట్టకేలకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. దాదాపు రెండేళ్ల నిరీక్షణ తర్వాత ఫిజికల్‌ మెజర్‌మెంట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 95,209 మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ ఈవెంట్స్ లో అర్హత సాధించిన వారికి తుది పరీక్ష నిర్వహించి ఎంపిక జాబితా విడుదల చేస్తారు..

Physical Tests for Constable Posts: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి
Physical Tests For Constable Posts
Follow us on

అమరావతి, జనవరి 1: ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. పలు జిల్లాల్లో పోలీసు కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు పోలీసు శిక్షణా కేంద్రం (డి.టి.సి)లో పకడ్బందీగా జరుగుతున్నాయి. మొత్తం 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్ధులు ఫిజికల్‌ మెజర్‌మెంట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఆయా కేంద్రాల్లో 600 మంది చొప్పున ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబర్ 28న విడుదలవగా.. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ప్రిలిమ్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. మొత్తం 95,209 మంది అభ్యర్ధులు ఫిజికల్‌ టెస్టులకు ఎంపికయ్యారు. ఫిజికల్ ఈవెంట్లకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లు తమతోపాటు తీసుకెళ్లవల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఒక సెట్‌ అటెస్టెడ్‌ జిరాక్స్‌ కాపీలు కూడా సమర్పించాలి. ముఖ్యంగా ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ మార్క్స్ లిస్ట్‌లు, ఒరిజినల్ డిగ్రీ సెర్టిఫికేట్, లేటెస్ట్ కుల ధృవీకరణ పత్రం, 6 నెలలలోపు గడువు కలిగిన కమ్యునిటీ సర్టిఫికెట్, BC అభ్యర్థులైతే క్రిమి లేయర్ సెర్టిఫికెట్‌, ఆధార్‌, స్టేజ్‌–2, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లను తప్పకుండ తీసుకువెళ్లాలి. వీటితోపాటు హాల్‌ టికెట్‌లో సూచించిన ఇతర సర్టిఫికెట్లను కూడా సమర్పించాలి.

కాల్ లెటర్ లో తెలిపిన తేదీ, సమయానికి మాత్రమే అభ్యర్థులను మైదానంలోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయానికి అభ్యర్థి హాజరు కాకపోతే అభ్యర్థులను మైదానంలోకి అనుమతి ఉండదు. ఇంకా కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే వర్కింగ్‌ డేలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 9441450639, 9100203323 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. లేదా అధికారిక వెబ్‌సైట్‌ ను సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.