APPSC Group 1 Mains: ‘ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే’ వైఎస్‌ షర్మిల

|

Aug 20, 2024 | 7:41 AM

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య మూడు వారాలే వ్యత్యాసం ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని షర్మిల పేర్కొన్నారు. అభ్యర్థుల జీవితాలతో సంబంధించిన అంశం కాబట్టి దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి ప్రభుత్వం న్యాయం చేయాలని ‘ఎక్స్‌’ వేదికగా..

APPSC Group 1 Mains: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే వైఎస్‌ షర్మిల
PCC president YS Sharmila
Follow us on

అమరావతి, ఆగస్టు 20: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య మూడు వారాలే వ్యత్యాసం ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని షర్మిల పేర్కొన్నారు. అభ్యర్థుల జీవితాలతో సంబంధించిన అంశం కాబట్టి దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి ప్రభుత్వం న్యాయం చేయాలని ‘ఎక్స్‌’ వేదికగా విజ్ఞప్తి చేశారు.

కాగా గత కొంతకాలంగా ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షలో 1:100 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేసి, మెయిన్స్‌ రాసేందుకు ఎక్కువ మందికి అనుమతి ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తదుపరి దశ అయిన మెయిన్స్‌ పరీక్షలు సెప్టెంబరు 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్ల ఇప్పటికే ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. మెయిన్స్‌ పరీక్షలు సమీపిస్తుంటే కమిషన్‌ మాత్రం అభ్యర్ధుల విజ్ఞప్తులపై స్పందించడం లేదు.

కాగా మార్చి 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా18 జిల్లాల్లో 301 పరీక్ష కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్‌ 1 పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 1,26,068 మంది హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 91,463 మంది పరీక్ష రాశారు. అయితే ఫలితాల్లో మాత్రం 1:50 చొప్పున 4,496 మంది అభ్యర్ధులు మాత్రమే మెయిన్స్‌ రాసేందుకు అర్హత సాధించారు. పరీక్ష నిర్వహించిన కేవలం 24 రోజుల్లోనే కమిషన్‌ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 81 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.