Pariksha Pe Charcha 2024: ‘పరీక్షా పే చర్చా’  ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. చివరి తేదీ ఇదే

|

Dec 15, 2023 | 9:53 PM

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీయేట ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు మోదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2024 సంవత్సరానికి కూడా 'పరీక్షా పే చర్చా' రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రధానితో మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధికారిక..

Pariksha Pe Charcha 2024: ‘పరీక్షా పే చర్చా’  ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. చివరి తేదీ ఇదే
Pariksha Pe Charcha 2024
Follow us on

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీయేట ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు మోదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2024 సంవత్సరానికి కూడా ‘పరీక్షా పే చర్చా’ రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రధానితో మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. జనవరి 12 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి గడువు విధించింది. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.

జనవరి 8న ఎస్‌ఎస్‌సీ ఎస్సై టైర్‌-2 పరీక్ష

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఎస్‌ఎస్‌సీ ఎస్సై టైర్‌-2 పరీక్షకు సంబంధించి ప్రకటన వెలువరించింది. ఢిల్లీ పోలీసు, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ విభాగంలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి టైర్‌-2 రాత పరీక్ష జనవరి 8వ తేదీన నిర్వహించనున్నట్లు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ వెల్లడించింది. ఈ మేరకు ప్రకటనలో పేర్కొంది.

ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌ ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల

తెలంగాణలోని ఎనిమిదో తరగతి విద్యార్థులకు డిసెంబ‌రు 10వ తేదీ నిర్వహించిన నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌) ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌ లో ఆన్సర్‌ ‘కీ’అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు. ఆన్సర్‌ కీలోని సమాధానాలపై అభ్యంతరాలను డిసెంబ‌రు 22వ తేదీలోపు సమర్పించాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

డిసెంబర్‌ 20తో ముగుస్తోన్న ఎన్‌ఐఓఎస్‌ దూరవిద్య పరీక్ష ఫీజు చెల్లింపు గడువు

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌) సెకండరీ (10వ తరగతి), సీనియర్‌ సెకండరీ (12వ తరగతి) ఏప్రిల్‌-2024 పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు డిసెంబరు 20వ తేదీతో ముగుస్తున్నట్లు ఎన్‌ఐఓఎస్‌ ప్రాంతీయ సంచాలకులు పి.సుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ.100 ఆలస్యం రుసుంతో డిసెంబర్‌ 21 నుంచి 31వ తేదీ వరకు చెల్లించవచ్చు. ఏకీకృత ఆలస్య రుసుంతో జనవరి 1 నుంచి 10 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. పరీక్ష ఫీజులను ఎన్‌ఐఓఎస్‌ వెబ్‌సైట్‌లో మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 040-24752859, 040-24750712 నంబర్లను సంప్రదించాలని వివరించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.