Medical Jobs: గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా ఎంపిక చేస్తారు.?

|

Aug 08, 2022 | 8:56 PM

Medical Jobs: గుంటూరు జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుప్రతుల్లో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (డీహెచ్‌), ఏపీ వైద్య విధాన పరిషత్‌...

Medical Jobs: గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా ఎంపిక చేస్తారు.?
Follow us on

Medical Jobs: గుంటూరు జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుప్రతుల్లో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (డీహెచ్‌), ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ), డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలోని ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఉద్యోగాలను కాంట్రాక్ట్‌/ అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భఱ్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 132 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డెంటల్ టెక్నీషియన్ (01), డైటీషియన్ (01), రేడియోగ్రాఫర్ (15), ఈసీజీ టెక్నీషియన్ (01), ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (02), జనరల్ డ్యూటీ అటెండెంట్ (36), మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ (02), ల్యాబ్ అటెండెంట్ (04), ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌-2 (11), ఆఫీస్ సబార్డినేట్ ( 14), ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 (13), ఫిజియోథెరపిస్ట్ (01), ప్లంబర్ (03), శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్ (13) ఫీమేల్‌ నర్సింగ్ ఆర్డర్లీ (06), ఓటీ టెక్నీషియన్(థియేటర్ అసిస్టెంట్) (09) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదోతరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, గుంటూరు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

* దరఖాస్తు ఫీజుగా రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 13-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..