Telangana: మొహర్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించడంతో ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఇవాళ జరగాల్సిన వివిధ పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షల నిర్వహణపై కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇక శనివారం జరగాల్సిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అప్‌డేట్స్ కోసం విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని తెలిపారు.
రెండు సెషన్లలో మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష..
తెలంగాణ వ్యాప్తంగా శనివారం నాడు మోడల్ స్కూళ్లలో ప్రవేశవాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు మోడల్ స్కూళ్ల ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. ఉదయం ఒక సెషన్ కాగా, మధ్యాహ్నం ఒక సెషన్ మాదిరిగా పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌లో 6వ తరగతి ప్రవేశాల కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్‌లో 7-10 వ తరగతి ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
లాసెట్ హాల్‌టికెట్ విడుదల..
ఇక లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం హాల్ టికెట్‌లను విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను శుక్రవారం సాయంత్రం 7 గంటల లోగా డౌన్‌లోడ్ చేసుకోవాలని లా సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జి.బి.రెడ్డి సూచించారు. ఈ నెల 21, 22వ తేదీల్లో లాసెట్ వెబ్‌సైట్ అందుబాటులో ఉండదని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఈ నెల 23, 24 తేదీల్లో లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగనున్న విషయం తెలిసిందే.
Also read:
మూడు సెంచరీలు.. అయినా మ్యాచ్ ఓడిపోయింది.. ఆ ఇద్దరు బౌలర్లే కారణం.!
Zodiac Signs: ఈ 6 రాశులవారు వజ్రాలు ధరించకూడదు.. సమస్యల వలయంలో చిక్కుకున్నట్లే.!
Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో దారుణం.. విమానంపై నుంచి పడి ఫుల్‌బాల్ ప్లేయర్ దుర్మరణం..