OU: ఉస్మానియా వర్సిటీ విద్యార్ధులకు పిడుగులాంటి వార్త.. ‘ఒక్కో బ్యాక్‌లాగ్ పేపర్‌కు రూ.10,000 కట్టాల్సిందే’

|

Dec 09, 2022 | 4:35 PM

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బ్యాక్‌లాగ్‌ పరీక్షలు రాసే పీజీ విద్యార్థులకు 'వన్‌ టైమ్‌ ఛాన్స్‌' అవకాశం ఇస్తున్నట్లు గురువారం (డిసెంబర్‌ 8) తెల్పింది. 2010 నుంచి 2017 సీబీసీఎస్‌ బ్యాచ్‌, 2010-2015 నాన్‌ సీబీసీఎస్‌ బ్యాచ్‌లకు చెందిన..

OU: ఉస్మానియా వర్సిటీ విద్యార్ధులకు పిడుగులాంటి వార్త.. ఒక్కో బ్యాక్‌లాగ్ పేపర్‌కు రూ.10,000 కట్టాల్సిందే
Osmania University
Follow us on

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బ్యాక్‌లాగ్‌ పరీక్షలు రాసే పీజీ విద్యార్థులకు ‘వన్‌ టైమ్‌ ఛాన్స్‌‘ అవకాశం ఇస్తున్నట్లు గురువారం (డిసెంబర్‌ 8) తెల్పింది. 2010 నుంచి 2017 సీబీసీఎస్‌ బ్యాచ్‌, 2010-2015 నాన్‌ సీబీసీఎస్‌ బ్యాచ్‌లకు చెందిన విద్యార్ధులు 1, 2, 3, 4 సెమిస్టర్‌లలో తమ బ్యాక్‌లాగ్‌లను పూర్తి చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ విధానం యూనివర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఎమ్‌ఏ, ఎమ్‌కాం, ఎమ్మెస్సీ, ఎమ్‌ఎస్‌డబ్ల్యూ, ఎమ్‌కాం (ఐఎస్), మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ కోర్సుల విద్యార్ధులకు మాత్రమే వర్తిస్తుంది.

వన్‌ టైమ్‌ ఛాన్స్‌ విధానం ప్రకారం.. అన్ని పరీక్షలకు రూ.2,050ల ఫీజు చెల్లించాలి. రెండు పేపర్ల వరకు రూ.1,160లు చెల్లించాలి. బ్యాక్‌లాగ్‌ పరీక్ష ఫీజులను జనవరి 7, 2023వ తేదీలోపు ఎటువంటి ఆలస్య రుసుములేకుండా చెల్లించవచ్చు. రూ.300ల ఆలస్య రుసుముతో జనవరి 17 వరకు చెల్లించవచ్చు. ఐతే నిర్దేశిత పరీక్ష ఫీజులతోపాటు.. ఒక్కో పేపర్‌కు పీనల్‌ ఛార్జీల కింద రూ.10,000ల వరకు చెల్లించాలని వర్సిటీ నిర్దేశించింది. దీంతో 12 ఏళ్లుగా పీజీ కోర్సులో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్‌లను పూర్తి చేసేందుకు అవకాశం కల్పించినప్పటికీ.. పెరిగిన ఫీజుల రిత్య విద్యార్ధులు గుడ్లు తేలేస్తున్నారు. ఈ లెక్కన రెండు పేపర్లు ఉన్న విద్యార్ధి పరీక్ష ఫీజు 1160తోపాటు ఒక్కోపేపర్‌ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.21,160లు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో బ్యాక్‌లాగ్‌లున్న విద్యార్ధులు కక్కలేక, మింగలేక అవస్థలు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.