ONGC Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త! ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీలో 3614 అప్రెంటీస్ ఖాళీలు..
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC).. అప్రెంటిస్ పోస్టుల (Apprentice Vacancies) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి..
ONGC Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC).. అప్రెంటిస్ పోస్టుల (Apprentice Vacancies) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 3614
పోస్టులు: అప్రెంటిస్ ఖాళీలు
ఖాళీల వివరాలు:
- నార్తర్న్ సెక్టార్: 209
- ముంబాయ్ సెక్టార్: 305
- వెస్ట్రన్ సెక్టార్: 1434
- ఈస్ట్రన్ సెక్టార్: 744
- సౌతర్న్ సెక్టార్: 694
- సెంట్రల్ సెక్టార్: 228
వయోపరిమితి: మే 15, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ. 7,700ల నుంచి రూ.9,000ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/బీబీఏ, బీకాం, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: