ONGC Recruitment 2021: ఓఎన్‎జీసీలో 309 గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ..

|

Oct 31, 2021 | 9:22 AM

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఇంజనీరింగ్, జియో-సైన్స్ విభాగాల్లో 309 గ్రాడ్యుయేట్ ట్రైనీల కోసం దరఖాస్తు గడువు ఈ రోజుతో ముగియనుంది.

ONGC Recruitment 2021: ఓఎన్‎జీసీలో 309 గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ..
Ongc
Follow us on

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఇంజనీరింగ్, జియో-సైన్స్ విభాగాల్లో 309 గ్రాడ్యుయేట్ ట్రైనీల కోసం దరఖాస్తు గడువు ఈ రోజుతో ముగియనుంది. ఇందులో ఏఈఈ, కెమిస్ట్‌, జియాలజిస్ట్‌, జియోఫిజిసిస్ట్‌, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ తదితర పోస్టులున్నాయి. గేట్ 2021 స్కోర్ ఆధారంగా E1 లెవెల్‌లో ఎంపిక చేయనున్నారు.

ఖాళీల వివరాలు
ఏఈఈ(సిమెంటింగ్‌) మెకానికల్: 06

ఏఈఈ(సిమెంటింగ్‌) పెట్రోలీయం: 01

ఏఈఈ (సివిల్స్): 18

ఏఈఈ (ఎలక్ట్రికల్): 40

ఏఈఈ (ఎలక్ట్రనిక్స్ ): 05

ఏఈఈ ( ఇన్స్‎ట్రూమెంటేషన్): 32

ఏఈఈ (మెకానికల్): 33

ఏఈఈ (ప్రొడక్షన్) – మెకానికల్: 15

ఏఈఈ (ప్రొడక్షన్) కెమికల్: 16

ఏఈఈ (ప్రొడక్షన్) పెట్రోలియం: 12

ఏఈఈ (ఎన్విరాన్‎మెంట్ ): 05

ఏఈఈ (రిజర్వాయర్): 09

కెమిస్ట్: 14

జియాలజిస్ట్: 19

జియోఫిజిసిస్ట్ (ఉపరితలం): 24

జియోఫిజిసిస్ట్ (వెల్స్): 11

మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్: 13

రవాణా అధికారి: 08

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌ 2021లో అర్హత సాధించి ఉండాలి.

వయసు: 2021 జూలై 31 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హతలు, గేట్‌-2021లో సాధించిన మెరిట్‌ స్కోర్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు గాను గేట్‌ 2021 స్కోరుకు 60 మార్కులు, విద్యార్హతలకు 25, ఇంటర్వ్యూకు 15 మార్కులు ఇస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలు ఉచితంగా, జనరల్‌/ఈడబ్ల్యూఎస్ /ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, ongcindia.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also.. CUG Recruitment: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం..