ONGC Recruitment 2021: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ పెట్రోలియ, సహజ వాయువు మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో ఇంజనీరింగ్, జియోసైన్సెస్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 309 గ్రాడ్యుయేట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఏఈఈ, కెమిస్ట్, జియాలజిస్ట్, జియోలజిస్ట్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్ 2021లో అర్హత పొందాలి.
* అభ్యర్థుల వయసు 31-07-2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను విద్యార్హతలు, గేట్ 2021లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్టలిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తారు.
* గేట్ స్కోరుకి 60 మార్కులు, విద్యార్హతలకి 25 మార్కులు, ఇంటర్వ్యూకి 15 మార్కులు కేటాయిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 11-10-2021న ప్రారంభం కాగా దరఖాస్తులకు చివరి తేదీగా 01-11-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Funny Video: గున్న ఏనుగుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ.. ఇచ్చిందెవరో తెలుసా? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Hyderabad News: పొంగి పొర్లిన మందు.. అమ్మాయిలతో చిందులు.. అంతలోనే ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..