Oil India Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు

|

May 06, 2021 | 3:11 PM

Oil India Recruitment 2021: దేశంలో కరోనా విజృంభిస్తున్నా.. ప్రముఖ సంస్థలు ఉద్యోగాలను భర్తీ చేయడంలో ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. రోజురోజుకు కొత్త కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు..

Oil India Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు
Follow us on

Oil India Recruitment 2021: దేశంలో కరోనా విజృంభిస్తున్నా.. ప్రముఖ సంస్థలు ఉద్యోగాలను భర్తీ చేయడంలో ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. రోజురోజుకు కొత్త కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇటీవల ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. తాజాగా దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అయిన ఆయిల్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 119 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు అసోంలోని డిబ్రూగ‌ఢ్‌లో ప‌నిచేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఖాళీల వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 119 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో గ్యాస్ లాగర్ విభాగంలో 20, అసిస్టెంట్ మెకానిక్ విభాగంలో 79, డ్రిల్లింగ్ టాప్ మ్యాన్ విభాగంలో 17, కెమికల్ అసిస్టెంట్ విభాగంలో 10, అసిస్టెంట్ రిగ్ ఎలక్ట్రీషియన్ 10, ఎలక్ట్రిక్ సూపర్ వైజర్ 5, డ్రిల్లింగ్ రిగ్ మ్యాన్ విభాగంలో 5, డ్రిల్లింగ్ హెడ్ మ్యాన్ విభాగంలో 4 చొప్పున ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో తెలియజేసింది.

విద్యార్హతల వివరాలు..

వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా విద్యార్హతలను నిర్ణయించారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడవచ్చు. వయో పరిమితి కూడా వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా నిర్ణయించారు. కెమికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇతర పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి అయితే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇంటర్వ్యూలను మే 24 నుంచి జూన్ 22 వరకు నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి:

Oxygen Cylinder: ఆక్సిజన్ సిలిండర్ల వినియోగంలో జాగ్రత్తలు.. ప్రమాదాల నివారణకు పాటించాల్సిన సూచనలు

AIIMS Recruitment 2021: మంగళగిరి ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు ఎప్పటి వరకు అంటే..