Career Options After 12th: ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తర్వాత ఏ కెరీర్ ఎంచుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నారా? అటువంటి వారికి బెస్ట్ ఆప్షన్ నర్సింగ్. నిజానికి, ఇంటర్ తర్వాత ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో నర్సింగ్ ఫీల్డ్ ఒకటి. ఇది వైద్య రంగానికి సంబంధించిన వృత్తి. నర్సింగ్ ఫీల్డ్ నేటి కాలంతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం నర్సింగ్ ప్రొఫెనల్స్‌కు స్వదేశంతోపాటు, విదేశాలలోనూ మరింత డిమాండ్ ఉంది. మీరూ 12వ తరగతి తర్వాత నర్సింగ్ కోర్సు ఎంచుకుంటే ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో ఎన్నో రకాలుగా ఉపాధి పొందొచ్చు. అయితే నర్సింగ్‌ను వృత్తిగా ఎంచుకునే వారు ప్రస్తుతం నర్సింగ్ రంగంలో అందుబాటులో ఉన్న కోర్సులు పూర్తి చేస్తేనే మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తద్వారా బంగారు భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. నర్సింగ్ ఫీల్డ్ కెరీర్‌గా ఎంచుకుంటే, మీరు తప్పనిసరిగా అందులోని కోర్సుల వివరాలు తెలుసుకోవల్సి ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్‌తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సులు కూడా ఈ రంగంలో అందుబాటులో ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశం పొందడానికి, సైన్స్ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. అనంతరం ఉన్నత విద్య కోసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా చేయవచ్చు.
నర్సింగ్ విభాగంలో కోర్సు చేశాక.. ముందుగా ప్రైవేట్ ఆసుపత్రుల తలుపులు మీ కోసం తెరుచుకుంటాయి. దీనితో పాటు ఎప్పటికప్పుడు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల రిక్రూట్‌మెంట్‌లు కూడా జరుగుతాయి. వీటి ద్వారా ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందవచ్చు. ఆసుపత్రులే కాకుండా, ఈ కోర్సు చేస్తున్న అభ్యర్థులు నర్సింగ్‌హోమ్‌లు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, కౌన్సెలింగ్ కేంద్రాలు, ఆరోగ్య నివాస్, సంరక్షణ కేంద్రాలు, రక్షణ సేవలు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్, అలాగే కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలోనూ జాబ్ చేయొచ్చు. అలాగే నర్సింగ్ కోర్సు చేసిన తర్వాత దేశంతో పాటు, విదేశాలలో కూడా మెరుగైన ప్యాకేజీతో ఉద్యోగం పొందొచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.