NPCIL Recruitment 2021: న్యూక్లియర్ పవర్ కార్పొరేష్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా వివిధ ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్‌షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో స్టెనోగ్రాఫర్ 3, సెక్రటేరియల్ అసిస్టెంట్ 4, హౌస్ కీపర్ 3, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటేనెన్స్ 17, డ్రాట్స్‌మ్యాన్ 1, కార్పెంటర్ 14, ప్లంబర్ 15, వైర్‌మ్యాన్ 11, డీజిల్ మెకానిక్ 11, పెయింటర్ 15, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ 16, ఫిట్టర్ 26, టర్నర్ 10, మెషినిస్ట్ 11, ఎలక్ట్రీషియన్ 28, ఎలక్ట్రానిక్ మెకానిక్ 15, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 13, వెల్డర్ 21, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 14 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 14 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మహారాష్ట్రలోని తారాపూర్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తల ప్రక్రియ అక్టోబర్ 28న ప్రారంభం కాగా నవంబర్ 15ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Southern Railway Posts: సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Manmohan Singh: ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్..
Bigg Boss 5 Telugu: ఆసక్తిగా మారిన 8వారం ఎలిమినేషన్.. ఈసారి ఎవరు హౌస్ నుంచి బయటకు వచ్చారంటే..