NTPC Recruitment 2021: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..? అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హైడ్రో) మెకానికల్–05, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(హైడ్రో) సివిల్–10 పోస్టులు ఉన్నాయి.
* ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(హైడ్రో) మెకానికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
* ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(హైడ్రో) సివిల్ పోస్టులకు అప్లై చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/సెలక్షన్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 60,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 30-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Ananya Panday : లాస్ వేగాస్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న లైగర్.. ఫొటోలు షేర్ చేసిన అనన్య..
kaikala satyanarayana : కైకాల ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా.. ఏ సహాయానికైనా సిద్ధం అంటూ దైర్యం..
Digital Banks: దేశంలో డిజిటల్ బ్యాంకులు.. ప్రతిపాదించిన నీతి ఆయోగ్..