NTPC Recruitment: 8వ తరగతి అర్హతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 20 వేల జీతం పొందే అవకాశం..

NTPC Recruitment:నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్న సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు...

NTPC Recruitment: 8వ తరగతి అర్హతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 20 వేల జీతం పొందే అవకాశం..

Updated on: Feb 04, 2022 | 8:24 PM

NTPC Recruitment:నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్న సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 25 జూనియర్‌ మజ్దూర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 8వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు అయితే 5వ తరగతి ఉత్తీర్ణత పొందితే చాలు.

* ఇదిలా ఉంటే నిబంధనల ప్రకారం ఎన్‌టీపీసీ ప్రాజెక్టుకు భూమి ఇచ్చిన వారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 51 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలోని ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,000 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 22-02-2022 చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Goutam Adani : ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అదానీ..మరో రికార్డూ కైవసం

Alert: పేరు, పుట్టిన తేది, ఫోన్‌ నెంబర్లని పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారా.. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం జాగ్రత్త..?

Statue of Equality: అబ్బురపరిచే ఆలయ నిర్మాణ విశేషాలు.. వీడియో