NTPC EET Recruitment 2021: భారత ప్రభుత్త రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మహారత్న కంపెనీ అయిన ఈ సంస్థలో ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఈఈటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పలు విభాగాల్లో మొత్తం 280 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నారు.
* పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 65 శాతం మార్కులకు తగ్గకుండా సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.
* చివరి ఏడాది/సెమిస్టర్ చదువుతోన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యాలిడ్ గేట్–2021 స్కోర్ ఉండాలి.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
* గేట్-2021లో వచ్చని మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులు దేశంలోని ఎన్‌టీపీసీ యూనిట్లలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 10-06-2021ని నిర్ణయంచారు.
* పూర్తి వివరాలకు www.ntpc.co.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: భారతీయ చట్టాలను మీరు గౌరవించి పాటించాల్సిందే ! ట్విటర్ కి కేంద్రం గట్టి హెచ్చరిక