IGNOU PhD 2022 Exam Dates: ఇగ్నో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్‌ తేదీ ప్రకటన.. ఈనెల్లోనే పరీక్ష!

|

Feb 15, 2022 | 9:36 AM

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU PhD Entrance Test) వివిధ కోర్సుల్లో పీహెచ్‌డీ అడ్మిషన్లకు గాను ప్రవేశ పరీక్ష 2021 తేదీని తాజాగా ప్రకటించింది..

IGNOU PhD 2022 Exam Dates: ఇగ్నో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్‌ తేదీ ప్రకటన.. ఈనెల్లోనే పరీక్ష!
Ignou
Follow us on

IGNOU PhD Entrance Exam 2021 Date: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU PhD Entrance Test) వివిధ కోర్సుల్లో పీహెచ్‌డీ అడ్మిషన్లకు గాను ప్రవేశ పరీక్ష 2021ను నిర్వహించనుంది. ఈ ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 24న నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. వీటికి సంబంధించిన హాల్‌ టికెట్లు త్వరలో విడుదలకానున్నాయి. అంతేకాకుండా ఇగ్నో పీహెచ్‌డీ కోసం అడ్వాన్స్‌డ్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ను కూడా ఎన్టీఏ విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ignou.nta.ac.in నుంచి అప్లికేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీని ఉపయోగించి వాటిని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా ఎన్టీయే ముఖ్య ప్రకటన చేసింది. అదేంటంటే.. ఇన్ఫర్మేషన్ స్లిప్‌లు అనేవి ప్రవేశ పరీక్ష కోసం ఉద్దేశించిన అడ్మిట్ కార్డులు కావని, దయచేసి ఈ విషయాన్ని గమనించాలని అభ్యర్ధులకు సూచించింది. పరీక్షా కేంద్రం ఉన్న చోటును, కేటాయించిన స్థలానికి సంబంధించిన ముందస్తు సమాచారం మాత్రమేనని, పరీక్ష రోజున అభ్యర్ధులు తికమక పడకుండా.. మరింత సులువుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలనే ఉద్ధేశ్యంతో విడుదలచేస్తున్నవని తెల్పింది. హాల్‌ టికెట్లు లేకుండా ఇన్ఫర్మేషన్‌ స్లిప్‌ను మాత్రమే తీసుకువస్తే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించబోమని సూచించింది.

అడ్మిట్ కార్డులు విడదలయ్యాక డౌన్‌లోడ్ చేయడంలో ఏదైనా ఇబ్బంది లేదా అడ్మిట్ కార్డ్‌లో ఉన్న వివరాలలో వ్యత్యాసం ఉంటే.. ఎన్టీఏ హెల్ప్ డెస్క్‌ 011-40759000 నంబర్‌ను సంప్రదించవచ్చు లేదా ignou@nta.ac.inకి మెయిల్‌ చేయవచ్చు. పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం ఎన్టీఏ వెబ్‌సైట్ www.nta.ac.in లేదా ఇగ్నో వెబ్‌సైట్ https://ignou.nta.ac.inను క్రమం తప్పకుండా చెక్‌ చేసుకోవాలని తెల్పింది.

Also Read:

ICAR IARI 2022 Exam Dates: నిరుద్యోగులకు గమనిక.. ఐకార్‌ 641టెక్నీషియన్‌ రాత పరీక్ష తేదీ విడుదల.. ఎప్పటినుంచంటే..