SWAYAM July 2025 Exam Dates: స్వయం జులై సెషన్‌కు మీరూ దరఖాస్తు చేశారా? రాత పరీక్ష తేదీలు చూశారా..

SWAYAM 2025 Application Last Date: స్వయం 2025 జులై సెషన్ పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా కీలక ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్‌ 31, 2025వ తేదీతో ముగిసింది. అయితే తాజాగా ఈ గడువును..

SWAYAM July 2025 Exam Dates: స్వయం జులై సెషన్‌కు మీరూ దరఖాస్తు చేశారా? రాత పరీక్ష తేదీలు చూశారా..
NTA SWAYAM July 2025 Session registration

Updated on: Oct 31, 2025 | 4:14 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 31: స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ (SWAYAM 2025) జులై సెషన్ సెమిస్టర్‌ పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా కీలక ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్‌ 31, 2025వ తేదీతో ముగిసింది. అయితే తాజాగా ఈ గడువును నవంబర్‌ 2వ తేదీ వరకు పొడిగించింది. అర్హత కలిగిన విద్యార్థులు స్వయం అధికారిక వెబ్‌సైట్‌లో జులై సెమిస్టర్‌ సెషన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీయే తన ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు ఫీజు నవంబర్‌ 3వ తేదీ వరకు చెల్లించవచ్చు. నవంబర్‌ 4 నుంచి 6 వరకు అప్లికేషన్‌ సవరణకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది.

కాగా మొత్తం 647 కోర్సుల్లో ప్రవేశాలకుగానూ స్వయం ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్వయం జులై సెషన్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లు చేసుకున్న వారికి డిసెంబర్‌ 11, 12, 13, 14 తేదీల్లో హైబ్రిడ్ మోడ్‌ అంటే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎన్టీయే స్వయం 2025 ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

రేపట్నుంచే పీజీ ఈసెట్‌ 2025 చివరి విడత కౌన్సెలింగ్‌.. తేదీలు ఇవే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు పీజీ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ తేదీలను ఎన్టీయే విడుదల చేసింది. నవంబరు 1 నుంచి వీటిని చేపట్టనున్నట్టు ప్రవేశాల కన్వీనర్‌ పాండురంగా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇక నవంబరు 13, 15వ తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం హాజరుకావాలని విద్యార్ధులకు సూచించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.