జేఈఈ మెయిన్స్ రాసే విద్యార్థులకు జాతీయ పరీక్షల సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌లో నిర్వహించనున్న తుది విడత పరీక్షకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి స్టార్ట్ అయింది. అభ్యర్థులు వచ్చే మార్చి 12 నుంచి రాత్రి 9 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. గతంలో ప్రకటించిన ప్రకారం.. అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు సమర్పించాలని ఎన్టీఏ తెలిపింది. అయితే.. అప్లికేషన్ల కోసం అప్పటి నుంచి ఎదురుచూస్తున్న విద్యార్థులకు.. ఎన్‌టీఏ వారం రోజులు ఆలస్యంగా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. తుది విడత పరీక్షలు ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో జరగనున్నాయి. అయితే ఏప్రిల్ 13, 15 తేదీలను ఎన్‌టీఏ రిజర్వు చేసింది.
కాగా.. ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు పలు తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్ తొలి విడత పరీక్ష నిర్వహించారు. జనవరి 24 ,25, 28, 29,30,31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్ష సెషన్-1 నిర్వహించారు. ఈ పరీక్షలకు 8.22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం