Bank Jobs: జాతీయ బ్యాంకుల్లో కొలువుల జాతర.. 5830 క్లరికల్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఆగస్టు 1

| Edited By: Subhash Goud

Jul 18, 2021 | 7:32 PM

Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. బ్యాంకుల్లో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక తాజాగా జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడింది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి..

Bank Jobs: జాతీయ బ్యాంకుల్లో కొలువుల జాతర.. 5830 క్లరికల్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఆగస్టు 1
Follow us on

Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. బ్యాంకుల్లో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక తాజాగా జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడింది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి ఇది మంచి అవకాశం. సొంత రాష్ట్రంలో భద్రమైన కొలువు. ఈ ఉద్యోగాలకు కేవలం రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇవన్ని బ్యాంకు క్లర్క్‌ పోస్టులు. 5,830 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశంలోని జాతీయ బ్యాంకుల్లో క్లర్క్‌, ఆఫీసర్‌, స్పెషలిస్ట్‌ వంటి పోస్టులను భర్తీ చేయడానికి పరీక్షలు నిర్వహించే సంస్థ.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌). ఏటా వేలాది పోస్టుల భర్తీకి పారదర్శకమైన ప్రక్రియలో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది ఈ సంస్థ. ప్రస్తుతం క్లరికల్‌ క్యాడర్‌ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ (సీఆర్‌పీ) క్లర్క్స్‌-XI నోటిఫికేషన్‌ను ఐబీపీఎస్‌ విడుదల చేసింది. అయితే సీఆర్‌పీ క్లర్క్స్‌ ఖాళీలు 2022-23 సంవత్సరానికి సంబంధించినవి.

పోస్టు: క్లర్క్‌ (క్లరికల్‌ క్యాడర్‌)
మొత్తం ఖాళీలు: 5830 (తెలంగాణ- 263, ఏపీ-263)

విద్యార్హతలు:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో డిగ్రీలో వచ్చిన పర్సంటేజీ తెలియజేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమయానికి మార్క్‌షీట్‌/డిగ్రీ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి.

కంప్యూటర్‌ లిటరసీ: కంప్యూటర్‌ సిస్టమ్స్‌ ఆపరేటింగ్‌, వర్కింగ్‌ నాలెడ్జ్‌ తప్పనిసరి. అభ్యర్థులు కంప్యూటర్‌ ఆపరేషన్స్‌/లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్‌/డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి లేదా హైస్కూల్‌/కాలేజీ స్థాయిలో కంప్యూటర్‌/ఐటీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

స్థానిక భాష: పోస్టుల ప్రాధాన్యతా క్రమంలో ఏ రాష్ట్రంలో పనిచేయాలనుకుంటున్నారో ఆ రాష్ట్ర, స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడటం తప్పనిసరి ఉండాల్సి ఉంటుంది. ఇక వయస్సు విషయానికొస్తే.. 2021, జూలై 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ ఎగ్జామ్‌

మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. పరీక్షలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
దీనిలో ఐబీపీఎస్‌ నిర్ణయించిన కటాఫ్‌ సాధించిన వారిని పోస్టుల సంఖ్యను బట్టి మెయిన్‌ ఎగ్జామ్‌కు అనుమతిస్తారు. ఈ పరీక్షలో జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 190 ప్రశ్నలు- 200 మార్కులు. పరీక్ష కాలవ్యవధి 160 నిమిషాలు. మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఆగస్ట్‌ 1
అప్లికేషన్‌ ఫీజు/ఇంటిమేషన్‌ చార్జీలు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మేన్లకు
రూ.175/-, ఇతరులకు రూ.850/-
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌:
https://www.ibps.in

ఇవీ కూడా చదవండి:

SSC GD Constable Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌ జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు