RRC NCR Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్

RRC NCR Jobs : రైల్వే శాఖ వివిధ ఉద్యోగాలకు వరసగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ.. నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వివిధ ప్రాంతాల్లోని ఖాళీలకు దరఖాస్తులను...

RRC NCR Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్
North Central Railway

Updated on: Apr 05, 2021 | 2:03 PM

RRC NCR Jobs : రైల్వే శాఖ వివిధ ఉద్యోగాలకు వరసగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ.. నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వివిధ ప్రాంతాల్లోని ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తాజాగా  పలు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు రైల్వే శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. . వేర్వేరు రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే శాఖ నోటిఫికేషన్లను విడుదల చేయగా నార్త్ సెంట్రల్ రైల్వేలో 480 అప్రెంటీస్ ఖాళీల భర్తీ, రైల్వేనిర్మాణ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో 74 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
ఈ పోస్టులకు పదవ తరగతి , ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 16వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలి.

మొత్తం 480 ఖాళీలు

ఫిట్టర్ – 286
వెల్డర్ 11
మెకానిక్ 84
కార్పెంటర్ 11
ఎలక్ట్రీషియన్ 88

విద్యార్హత :

పదవ తరగతి లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్సీవీటీ అనుబంధ సంస్థ నుంచి ఐటీఐ పాసై ఉండాలి.

వయస్సు : 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

పరీక్ష ఫీజు : జనరల్‌ అభ్యర్థులు 170 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. https://ncr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: దక్షిణాది క్రేజీ హీరోయిన్ .. కన్నడ సోయగం రష్మిక మందన్నా పుట్టిన రోజు నేడు..