Nokia Recruitment: ఒకప్పుడు మొబైల్ ఫోన్స్‌కు పెట్టింది పేరైన నోకియా స్మార్ట్ ఫోన్ రంగంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే ప్రస్తుతం స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్‌ల తయారీతో మళ్లీ పూర్వ వైభవం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఉద్యోగులను సైతం భర్తీ చేసుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ పేరుతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకీ ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోకియా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేస్తోంది.
* విద్యార్థి దశలో ఉన్న సమయంలోనే ఎంపిక చేసుకొని వారికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించి సంస్థలోకి తీసుకుంటారు.
* గ్రాడ్యుయెట్ ఇంజనీర్ ట్రెయిన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్) విద్యార్హత ఉండాలి.
* అభ్యర్థులు క్లౌడ్ నెట్‌వర్క్ సిస్టమ్, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌తో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా అధికారి వెబ్‌సైట్‌లో వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.
* దరఖాస్తులో ఇచ్చిన వివరాల ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..