NMDC Recruitment: హైదరాబాద్‌ ఎన్‌ఎండీసీలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..

|

Mar 16, 2022 | 9:49 PM

NMDC Recruitment: నేషనల్‌ మినరల్‌ డెవలప్‌ఎమంట్ కార్పొరేషన్‌ (NMDC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ సంస్థ గేట్‌ - 2021 స్కోర్ ఆధారంగా పలు పోస్టులను భర్తీ చేయనుంది. వివిధ విభాగాల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు...

NMDC Recruitment: హైదరాబాద్‌ ఎన్‌ఎండీసీలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..
Nmdc Jobs
Follow us on

NMDC Recruitment: నేషనల్‌ మినరల్‌ డెవలప్‌ఎమంట్ కార్పొరేషన్‌ (NMDC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ సంస్థ గేట్‌ – 2021 స్కోర్ ఆధారంగా పలు పోస్టులను భర్తీ చేయనుంది. వివిధ విభాగాల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఎలక్ట్రికల్‌ (6), మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ (9), మెకానికల్‌(10), మైనింగ్‌ (4) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌–2021 వాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.

* అభ్యర్థుల వయసు దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట గేట్‌-2021 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు మొదట నెలకు రూ. 50,000+ఇతర అలవెన్సులు అందజేస్తారు. విజయతంతంగా ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న అంతనరం వారిని అసిస్టెంట్‌ మేనేజర్లుగా నియమిస్తారు. ఆ సమయంలో నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,80,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 23-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: IPL 2022: ఫిట్‌నెస్ టెస్టులో పాసైన హార్దిక్.. విఫలమైన ఢిల్లీ ఓపెనర్..

Minister Harish rao: త్వరలోనే వైద్యారోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

Chess Olympiad: ప్రపంచ చెస్ ఒలింపియాడ్ 2022కి వేదికైన చెన్నై.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎమన్నారంటే?