Court Jobs: ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టులో ఉద్యోగాలు.. ఆ జిల్లా వారికి మాత్రమే అవకాశం..

|

Oct 19, 2022 | 11:34 PM

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నిజామాబాద్‌లోని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు (పోక్సో)లో పలు పోస్టులను భర్తీ చేయడానికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కార్యాలయం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు..

Court Jobs: ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టులో ఉద్యోగాలు.. ఆ జిల్లా వారికి మాత్రమే అవకాశం..
Fast Track Court Jobs
Follow us on

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నిజామాబాద్‌లోని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు (పోక్సో)లో పలు పోస్టులను భర్తీ చేయడానికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కార్యాలయం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీనియర్ సూపరింటెండెంట్(హెడ్ క్లర్క్) (01), సీనియర్ అసిస్టెంట్ (01), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 (01), జూనియర్ అసిస్టెంట్ (02), టైపిస్ట్ (02), డ్రైవర్ (01), ఆఫీస్ సబార్డినేట్(అటెండర్) (04) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా 7వ తరగతి, 10వ తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్/ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే కేవలం నిజమాబాద్‌ జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, నిజామాబాద్‌ చిరునామాకు పోస్టు/ కొరియర్ ద్వారా పంపించాలి.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 31-10-2022ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..