NIT Campus Placement: కరోనా సంక్షోభం కొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా భారీగా ఉద్యోగాల్లో కోతలు పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వరంగల్ జాతీయ సాంకేతికవిద్యా సంస్థ (ఎన్ఐటీ) విద్యార్థులు సత్తా చాటారు. 2020-2021 విద్యా సంవత్సరానికి నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏకంగా 800 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు.
గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, క్వాల్కం తదితర సాఫ్ట్‌వేర్ కంపెనీలు విద్యార్థులను సెలక్ట్ చేసుకున్నాయి. వీటితో పాటు ఈ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సుమారు 250 సంస్థలు పాల్గొన్నాయి. ఇందులో భాగంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఓ విద్యార్థి అత్యధికంగా ఏడాదికి రూ. 51.5 లక్షల ప్యాకేజీతో అట్లాసియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నారు. ఏడాదికి రూ.20 లక్షలకు పైగా ప్యాకేజీతో 130 మంది కొలువులు పొందారు. 350 మంది వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం దక్కించుకున్నారు.
Also Read: TANA Election Live: అమెరికాలో ముగిసిన తానా ఎన్నికల కౌంటింగ్.. అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్