NIT Warangal Jobs 2022: వరంగల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ట్రైనీ పోస్టులు.. ఈ అర్హతలు తప్పనిసరి..

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లోనున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

NIT Warangal Jobs 2022: వరంగల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ట్రైనీ పోస్టులు.. ఈ అర్హతలు తప్పనిసరి..
NIT Warangal

Updated on: Oct 01, 2022 | 9:43 AM

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లోనున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎంఎల్‌ఐఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్‌లో నాలెడ్జ్‌ ఉండాలి. టెక్నికల్ లైబ్రరీలో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్‌ 28, 2022వ తేదీలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.15,000ల చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: The Registrar, National Institute of Technology, Warangal – 506 004 (TS).

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.