NIT Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
NIT Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన ఈ విద్యా సంస్థ ఢిల్లీలోని క్యాంపస్‌లో...
NIT Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన ఈ విద్యా సంస్థ ఢిల్లీలోని క్యాంపస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ ఖాళీలు, ఏ విభాగంలో ఎన్ని ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (08), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (01), మెకానికల్ ఇంజినీరింగ్ (02) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంటెక్‌తో పాటు పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు సంబంధిత డ్యాక్యుమెంట్లో ఢిల్లీలోని నిట్ క్యాంపస్‌కు హాజరు కావాలి. సంబంధిత సబ్జెక్టుల డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
* వాక్ ఇన్ ఇంటర్వ్యూలను జులై 27, 2022న నిర్వహించనున్నారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..