DSNLU Recruitment: విశాఖలోని నేషనల్ లా యూనివర్సిటీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
DSNLU Recruitment: దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ(DSNLU) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖపట్నంలోని ఈ నేషనల్ లా యూనివర్సిటీలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు...
DSNLU Recruitment: దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ(DSNLU) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖపట్నంలోని ఈ నేషనల్ లా యూనివర్సిటీలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా టీచింగ్, నాన్ టీచింగ్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్(ఇంగ్లిష్, సోషియాలజీ), టీచింగ్ అసోసియేట్, రిసెర్చ్ అసిస్టెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్/ స‌్లట్/ సెట్ అర్హత, టీచింగ్/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను నేరుగా ది రిజిస్ట్రార్, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, సబ్బవరం, విశాఖపట్నం 531035 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను తొలుత అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 20-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..