భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోనున్న నేషనల్ ఆకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్.. ఒప్పంద ప్రాతిపదికన 17 రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేది ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 6, 2022వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు అక్టోబర్ 13వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
అడ్రస్: National Institute Of Rural Development &Panchayati Raj, Rajendranagar, Hyderabad -500 030.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.