NIPER Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(NIPER) పలు పోస్టుల భర్తీకి నోటిఫకేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, స్టోర్‌కీపర్, అసిస్టెంట్ గ్రేడ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ ఇంటర్మీడియట్/ బ్యాచిలర్ డిగ్రీ/ బీకామ్/ ఎంఎస్సీ/ ఎంఫార్మసీ/ ఎంవీఎస్సీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* పోస్టుల ఆధారంగా అభ్యర్థుల వయసు 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* అప్లికేషన్ ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ల దరఖాస్తుల స్వీకరణ 01-02-2022న ప్రారంభమవుతుండగా, 02-03-2022తో గడువు ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Cold Hit Alert: రికార్డుస్థాయిలో పెరుగుతున్న చలి తీవ్రత.. మరో రెండు రోజులు తప్పదంటున్న వాతావరణ శాఖ