NIN Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

|

Feb 20, 2022 | 5:48 PM

NIN Recruitment: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రీషన్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ ఆరోగ్యర, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో పలు పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు...

NIN Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Nin Jobs
Follow us on

NIN Recruitment: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రీషన్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ ఆరోగ్యర, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో పలు పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ (01), ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ (03), ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్‌ (04), ప్రాజెక్ట్‌ ల్యాబొరేటర్ఈ అటెండెంట్‌ (01), ప్రాజెక్ట్ డేలా ఎంట్రీ ఆపరేటర్‌ (01) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, డీఎంఎల్‌టీ, డిప్లొమా, పీహెచ్‌డీ/ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ది డైరెక్టర్‌, ఐసీఎమ్‌, నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషియన్‌, జమై ఉస్మానియా పోస్ట్‌, తార్నక, హైదరాబాద్‌ 50007, తెలంగాణ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత విద్యార్హతలు, అనుభవవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,800 నుంచి రూ. 47,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 10-03-2022 చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: టీచర్‌ బదిలీతో విద్యార్థుల కన్నీరు మున్నీరు.. వినూత్నంగా వీడ్కోలు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Sonu Sood: పంజాబ్‌ మోగాలో సోనూసూద్‌కు ఈసీ ఝలక్.. కారును సీజ్‌ చేసిన పోలీసులు..

AP Movie Ticket Issues: టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న ఏపీ సర్కార్.. ప్రేక్షకులకు, చిత్రపరిశ్రమకు ఆమోదయోగ్యంగా నిర్ణయం!