NIN Hyderabad Junior Medical Officer Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ మెడికల్ ఆఫీసర్, ఎస్‌ఆర్‌ఎఫ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితర పోస్టుల (Junior Medical Officer Posts) భర్తీకి నోటిఫికేసన్ జారీ చేసింది. ఎంపికైనవారు హైదరాబాద్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 116
పోస్టుల వివరాలు: జూనియర్ మెడికల్ ఆఫీసర్, ఎస్‌ఆర్‌ఎఫ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ వర్కర్లు, ఎంటీఎస్ తదితర పోస్టులు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.15,800ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, మెడికల్ డిగ్రీ (ఎంబీబీఎస్/బీఏఎంఎస్/ఎండీఎస్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
అడ్రస్: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఆఫీసుల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ తేదీలు: జులై 4, 5, 6 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.