NIFT 2026 Admissions: ఫ్యాషన్‌ డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిఫ్ట్‌ 2026 అడ్మిషన్‌ నోటిఫికేషన్.. ప్రవేశాలు ఎలా పొందాలంటే?

ఫ్యాషన్‌ ప్రపంచంలో రాణించాలనుకునేవారికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌ 2026) యూజీ, పీజీ ఫ్యాషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. హైదరాబాద్‌ సహా 20 కేంద్రాల్లో దీని బ్రాంచులు ఉన్నాయి. నాలుగేళ్ల యూజీ ఫ్యాషన్‌ టెక్నాలజీతోపాటు యాక్సెసరీ డిజైన్..

NIFT 2026 Admissions: ఫ్యాషన్‌ డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిఫ్ట్‌ 2026 అడ్మిషన్‌ నోటిఫికేషన్.. ప్రవేశాలు ఎలా పొందాలంటే?
NIFT 2026 Admission into Fashion designing Courses

Updated on: Dec 30, 2025 | 11:21 AM

ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ హుందాగా, ఆకర్షణీయంగా కనిపించడానికి ఫ్యాషన్‌ డిజైనర్స్‌ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఫ్యాషన్‌ కోర్సులకు యమ డిమాండ్‌ ఉంది. ఫ్యాషన్‌ ప్రపంచంలో రాణించాలనుకునేవారికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌ 2026) యూజీ, పీజీ ఫ్యాషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. హైదరాబాద్‌ సహా 20 కేంద్రాల్లో దీని బ్రాంచులు ఉన్నాయి. నాలుగేళ్ల యూజీ ఫ్యాషన్‌ టెక్నాలజీతోపాటు యాక్సెసరీ డిజైన్, నిట్‌వేర్‌ డిజైన్, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్, లెదర్‌ డిజైన్, ఫ్యాషన్‌ డిజైన్, టెక్స్‌టైల్‌ డిజైన్‌ కోర్సులు ఇది అందిస్తుంది. ఇక రెండేళ్ల పీజీలో డిజైన్, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. సృజనాత్మకత, డిజైన్‌ కోర్సులు అందిస్తుంది. యూజీ, పీజీకి కలిపి 5000పైగా సీట్లు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సుల్లో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌లో అర్హత పొంది ఉండాలి. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో ప్రవేశాలకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తో ఇంటర్‌ లేదా మూడేళ్ల డిప్లొమాలో ఉత్తీర్ణత పొందాలి. అభ్యర్ధుల వయసు పై రెండు కోర్సులకూ ఆగస్టు 1, 2026 నాటికి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల వరకు మినహాయింపు ఉంటుంది. అలాగు మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు అయితే ఏదైనా డిగ్రీ లేదా నిఫ్ట్‌ లేదా నిడ్‌ నుంచి కనీసం మూడేళ్ల వ్యవధితో యూజీ డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సుకు దరఖాస్తు చేసుకునే వారు నిఫ్ట్‌ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్‌) లేదా బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అన్ని యూజీ, పీజీ కోర్సులకూ చివరి సంవత్సరం చదువుతన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీకి ఎలాంటి వయోనిబంధన లేదు.

నిఫ్ట్‌ 2026 అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 6, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.5000 ఫైన్‌తో జనవరి 10, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్ష ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, మిగిలిన కేటగిరీలకు చెందిన వారు రూ.2000 చెల్లించాలి. రెండు కోర్సులకైతే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.750, మిగిలిన వారు రూ.3000 చొప్పున చెల్లించాలి. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 8, 2026వ తేదీన ఉంటుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఫ్యాషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సులు విజయవంతంగా పూర్తిచేసిన వారికి ఫ్యాషన్‌ డిజైనర్, స్టైలిస్ట్‌ (స్టోర్స్‌), ఫ్యాషన్‌ రిటైలర్, ఫ్యాషన్‌ ఆంత్రప్రెన్యూర్, పర్సనల్‌ స్టైలిస్ట్, సెలబ్రిటీ స్టైలిస్ట్‌ వంటి వివిధ కెరీర్‌ అవకాశాలు ఉంటాయి. సొంతగా బొటిక్‌ కూడా నిర్వహించుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.