NID Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..

|

Feb 17, 2022 | 4:44 PM

NID Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (NID) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఈ సంస్థ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

NID Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
Nid Jobs
Follow us on

NID Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (NID) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఈ సంస్థ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రిన్సిపల్‌ డిజైనర్‌(ప్రొఫెసర్‌)–03, సీనియర్‌ ఫ్యాకల్టీ డిజైనర్‌(అసోసియేట్‌ ప్రొఫెసర్‌)–03, అసోసియేట్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ డిజైనర్‌(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌)–05, డిజైనర్‌/ఫ్యాకల్టీ–07, ప్రిన్సిపల్‌ టెక్నికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌–02, సీనియర్‌ టెక్నికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌–02, సీనియర్‌ డిజైన్‌ ఇన్‌స్ట్రక్టర్‌–01 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ/డిప్లొమా, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.

* అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 45–55 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ముందుగా పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ, ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 10-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Chiranjeevi’s Godfather: శరవేగంగా ‘గాడ్ ఫాదర్’ షూటింగ్.. షెడ్యూల్ కంప్లీట్ చేసిన లేడీ సూపర్ స్టార్

Taslima Nasreen: స్త్రీ ద్వేషులు ఆ పద్ధతిని పరిచయం చేశారు.. హిజాబ్‌పై బంగ్లాదేశ్ రచయిత్రి సంచలన వ్యాఖ్యలు..

DMHO Kurnool Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే.. కర్నూలులో 70 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఉద్యోగాలు..నెలకు లక్ష జీతం..