NIC Recruitment 2022: ఇంజనీరింగ్‌ చదివి ఖాళీగా ఉన్నారా? నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌లో నెలకు రూ.2 లక్షల జీతంతో ఉద్యోగాలు..

|

Oct 20, 2022 | 7:01 AM

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌.. 127 సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల

NIC Recruitment 2022: ఇంజనీరింగ్‌ చదివి ఖాళీగా ఉన్నారా? నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌లో నెలకు రూ.2 లక్షల జీతంతో ఉద్యోగాలు..
NIC New Delhi Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌.. 127 సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్, రేడియో ఫిజిక్స్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, మెటీరియల్స్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, కంప్యూటర్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్, కమ్యూనికేషన్, కంప్యూటర్ అండ్‌ నెట్‌వర్కింగ్ సెక్యూరిటీ, కంప్యూటర్ అప్లికేషన్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్ మేనేజ్‌మెంట్, సైబర్ లా, బయో-ఇన్ఫర్మేటిక్స్, రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (GIS), జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఆపరేషన్స్ రీసెర్చ్‌, టోటల్ క్వాలిటీ మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, డిజైన్ విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ/బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ టెక్నాలజీ/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంఈ/ఎంటెక్‌/ఎమ్మెస్సీ/బీఈ/బీటెక్‌/ఎంఫిల్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు నవంబర్‌ 21, 2022వ తేదీ నాటికి 35 నుంచి50 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్న అభ్యర్ధులు నవంబర్‌ 21, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.800లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. పర్సనల్‌ ఇంటెరాక్షన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.67,700ల నుంచి రూ.2,16,600ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.