NHM Telangana Jobs 2022: తెలంగాణ నేషనల్ హెల్త్ మిషన్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
నేషనల్ హెల్త్ మిషన్ (NHM).. తెలంగాణలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఒప్పంద ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ (District Quality Assurance Manager Posts) భర్తీకి అర్హులైన..
NHM Telangana District Quality Assurance Manager Recruitment 2022: నేషనల్ హెల్త్ మిషన్ (NHM).. తెలంగాణలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఒప్పంద ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ (District Quality Assurance Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 12
పోస్టుల వివరాలు: డిస్ట్రిక్ట్ క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ. 500
- ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూసీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ.250
అడ్రస్: Commissioner of Health & Family Welfare and Mission Director, National Health Mission, T.S., Hyderabad.
ఇంటర్వ్యూ తేదీ: మే 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: