NHLML Recruitment 2022: డిగ్రీ అర్హతతో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌లో కొలువులు..ఎంపిక ఇలా..

|

Jun 09, 2022 | 8:27 PM

భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (NHLML).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ తదితర పోస్టుల (Assistant Vice President Posts) భర్తీకి..

NHLML Recruitment 2022: డిగ్రీ అర్హతతో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌లో కొలువులు..ఎంపిక ఇలా..
Nhlml
Follow us on

NHLML Assistant Vice President Recruitment 2022: భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (NHLML).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ తదితర పోస్టుల (Assistant Vice President Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 9

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మిన్), వైస్ ప్రెసిడెంట్ (రోప్‌వేస్), సీనియర్ మేనేజర్ (రోప్‌వేస్), మేనేజర్ (లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), సీనియర్ మేనేజర్ (ప్యాసింజర్ కన్వీనియన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), కంపెనీ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఛైర్మన్ ఆఫీస్‌), ప్రైవేట్ సెక్రటరీ (సీఈవో), మేనేజర్ (ఓఎఫ్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) పోస్టులు

పే స్కేల్‌: అనుభవం, అర్హత ఆధారంగా జీతం చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 56 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, లా డిగ్రీ, పీజీ, డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: సెలక్షన్‌ కమిటీ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Sh. Ravinder
Director/COO
National Highways Logistics Management Limited (NHLML)
G-5 & 6 Sector 10 Dwarka
New Delhi-110075

ఈ మెయిల్‌ ఐడీ: ravinder.nhlml@nhai.org

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.