NHAI Recruitment 2022: ఇంజనీరింగ్ నిరుద్యోగులకు అలర్ట్! నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కొలువులు షురూ..
భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI).. చీఫ్ జనరల్ మేనేజర్ (టెక్నికల్) పోస్టుల (Chief General Manager Posts) భర్తీకి..
NHAI Chief General Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI).. చీఫ్ జనరల్ మేనేజర్ (టెక్నికల్) పోస్టుల (Chief General Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 8
పోస్టుల వివరాలు: చీఫ్ జనరల్ మేనేజర్ (టెక్నికల్) పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.37,400ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 48 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: సెలక్షన్ కమిటీ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: డీజీఎం (హెచ్ఆర్ అండ్ అడ్మిన్), నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), సెక్టార్ 10, ద్వారకా, న్యూఢిల్లీ 110075.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 10, 2022.
హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ: జూన్ 27, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: